వాస్తవ నేస్తం,బోథ్ : నియోజకవర్గ కేంద్రంలోని ఆటో డ్రైవర్లకు రోడ్డు, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సీఐ వెంకటేశ్వర రావు అన్నారు. బుధవారం ఆయన డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనా కల్పించారు. వాహనం నడిపే వారు లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు, వాహనానికి ఇన్సూరెన్సు తప్పనిసరి ఉండాలని అన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం, సేల్ ఫోన్ మాట్లాడుతు వాహనం నడపడం నేరమాని అన్నారు. టర్న్ తీసుకునేటప్పుడు ప్రమాదలను నీవరించడానికి ఎల్లప్పుడు సిగ్నల్ ఇస్తూ నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. అతివేగంగా వెళ్లడం ప్రమాదలకు కారణం అని పరిమితికిమించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, వాహనం నడిపేటప్పుడు వేగపరిమితులను రోడ్డుపై ఎప్పుడు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్, తదితరులు ఉన్నారు.
