కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారం చేయాల్సి ఉండగా దీన్ని ఆసరా చేసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంచక్కా నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తూ ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు పాఠశాలకు ప్రస్తుతం పరీక్షల సమయం ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధించాల్సింది పోయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బిజెపి కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల మద్దతుతో నిలబడ్డ అభ్యర్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రచారం చేయడం స్థానికంగా చర్చనీయాంశమవుతుంది ఉపాధ్యాయులను యువతను ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా పార్టీలకు ఓటు వేసేలా మద్దతు కూడగడుతున్నారు ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఉపాధ్యాయులపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని విద్యావంతులు కోరుతున్నారు