Saturday, March 15, 2025
ads
Homeతెలంగాణదమ్ముంటే అభివృద్ధి చేయండి లేదంటే గద్దె దిగండి ఎమ్మెల్యే...

దమ్ముంటే అభివృద్ధి చేయండి లేదంటే గద్దె దిగండి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్, సత్యగామా, అంత్వర్, జుక్కల్, చందాపూర్ గ్రామాలకు చెందిన ప్రజలు వారి గ్రామాలకు సంబంధించిన రోడ్లను నిర్మించాలని నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యె మాట్లాడుతూ..
గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావు గారి కృషి వల్ల నారాయణఖేడ్ నియోజకవర్గానికి అనేక నిధులు రాబట్టి అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.
అలాగే ఈ గ్రామాలకు సంబంధించిన రోడ్ల కోసం జీవో కూడా తీసుకువచ్చి నప్పుడు ప్రారంభించే లోపం ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి నిర్లక్ష్యం అయినందువలన పనులు జరగలేదు అని నేను ఎమ్మెల్యేగా గెలుపొంది ఉంటే ఈపాటికి ఈ గ్రామాలకు సంబంధించిన రోడ్లు పనులు పూర్తి అయ్యేవని తెలిపారు.
ఈ చేతకాని దద్దమ్మ ఎమ్మెల్యే మరియు ఎంపీ గెలుపొందిన సంవత్సరం గడిచిపోయిన ఇంకా వీటి పనులు ప్రారంభించక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
మీకు దమ్ముంటే అభివృద్ధి చేయండి లేదంటే రాజీనామా చేయండి అని సవాలు చేశారు..
ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, ఉపాధ్యక్షులు నర్సింలు యాదవ్, తాజా మాజీ సర్పంచులు వెంకటేశం, రాజు, సల్మాన్, కృష్ణ,మాజీ ఎంపీటీసీ ముజామిల్, నాయకులు లక్ష్మణ్ రావు అడ్వకేట్, రాజిరెడ్డి, రాములు, మహేష్, శ్రీను, సురేష్, రాములు, రవి, షమీం పటేల్, యూసుబ్, గోపాల్, బీరుగొండ, సంజీవరెడ్డి, లక్ష్మణ్, మల్లయ్య, అంజయ్య, రాజు, రాజేందర్రావు, వినయ్, నర్సింలు, సాయిలు, అంజయ్య, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments