గంపా నాగేశ్వర్ రావు స్థాపించిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ బంధం రావూరి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ 189వ బ్యాచ్ ట్రైనింగ్ హైదరాబాద్ లోని మినర్వా గ్రాండ్ స్టార్ హోటల్లో ఫిబ్రవరి 8, 9, రెండు రోజుల పాటు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ నేర్పించారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ పట్టణానికి చెందిన మధురా చౌహాన్ ట్రైనింగ్లో పాల్గొన్న 37 మందిలో బెస్ట్ ప్రజెంటేషన్ స్పీకర్ గా సెలెక్ట్ కావడంతో ఇంపాక్ట్ నిర్వాహకుల చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా మధుర చౌహాన్ మాట్లాడుతూ ఇంపాక్ట్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో స్టూడెంట్స్ ను మోటివేషన్ చేస్తానన్నారు.