సత్యమేవ జయతే – వికారాబాద్
వికారాబాద్ : ఆ పోరాటం జరుగుతున్న సమయంలో పార్టీ ఇచ్చిన మద్దతుకు జ్యోతి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు రెండు మూడుసార్లు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసిన జ్యోతి తాను ఆసుపత్రికి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లుగా చెప్పారు. దీంతో జ్యోతి ఆసుపత్రికి వెళ్లేందుకు.. డెలివరీ అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ తరుపున అండగా నిలిచారు. ఓ పసిపాపకు నామకరణం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. కొద్ది రోజుల క్రితం జరిగిన లగచర్ల పోరాటం అందరికీ తెలిసిందే..! వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మసిటీకి భూములు ఇవ్వబోము అంటూ అక్కడి గిరిజన రైతులు ప్రభుత్వ అధికారులపై పోరాటం చేశారు. గ్రామ సభకు వచ్చిన జిల్లా కలెక్టర్‌పై తిరగబడ్డారు. ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అదొక సంచలనంగా మారింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రేవంత్ రెడ్డి కఠిన చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు బాధ్యులైన 32 మంది లగచర్ల రైతులను జైలుకు పంపించింది ప్రభుత్వం. అయితే ఈ మొత్తం లగచర్ల ఉద్యమంలో హైలెట్ గా నిలిచింది జ్యోతి అనే మహిళ. గర్భవతిగా ఉన్న జ్యోతి తన భర్తను ఎలాంటి సంబంధం లేకుండా జైలుకు పంపారంటూ.. ఎస్సీ ఎస్టీ కమిషన్, మానవ హక్కుల సంఘం వరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఢిల్లీ వరకు వెళ్లి నేషనల్ హ్యూమన్ రైట్స్ ముందు తన గోడు వినిపించింది. మీడియాలో కూడా లగచర్ల పోరాటం పై మాట్లాడుతూ గిరిజనుల గూడును వినిపించిన జ్యోతి అందరికీ గుర్తుండిపోయింది.
అప్పుడు గర్భవతిగా ఉన్న జ్యోతి రెండు వారాల క్రితం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే మొదటి నుంచి లగచర్ల పోరాటానికి మద్దతుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఫిబ్రవరి 10, సోమవారం అదే ప్రాంతంలో రైతు ధర్నా నిర్వహించింది. అక్కడికి మాజీ మంత్రి కేటీఆర్ కూడా వెళ్లారు. లగచర్ల ప్రజలు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. అక్కడికి వచ్చిన జ్యోతి తన కూతురికి నామకరణం చేయమని కేటీఆర్ ని అడిగింది. చాలా సంతోషంగా ఆ పాపను చేతుల్లోకి తీసుకున్న కేటీఆర్ ఆ అమ్మాయికి భూమి నాయక్ అని పేరు పెట్టారు. భూమికోసం మీరు చేసిన పోరాటానికి గుర్తుగా ఈ పాపకు భూమి నాయక్ అని పేరు పెడుతున్నానంటూ చెప్పారు. ఆ పోరాటం జరుగుతున్న సమయంలో పార్టీ ఇచ్చిన మద్దతుకు జ్యోతి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు రెండు మూడుసార్లు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసిన జ్యోతి తాను ఆసుపత్రికి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లుగా చెప్పారు. దీంతో జ్యోతి ఆసుపత్రికి వెళ్లేందుకు.. డెలివరీ అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని తాము చూసుకుంటామంటూ హామీ ఇచ్చి అండగా నిలిచారు కేటీఆర్.