సత్యమేవ జయతే – ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో తోయగూడ గ్రామస్థులు బతుకు దెరువు కోసం.. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇలా ఎక్కడెక్కడో నివాసం ఉన్న సుమారు 500 మందికిపైగా 40 ఏళ్ల తర్వాత ఖాళీ చేసిన గ్రామ శివారులో కలుసుకున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అందరూ కలిసి భోజనాలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం , ఆదిలాబాద్ జిల్లా లోని బేల మండలం, తోయగూడ గ్రామస్థులు మధురానుభూతులను కైవసం చేసుకున్నారు. జైనథ్ మండలం సాత్నాల వద్ద 1984లో ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించింది. ప్రాజెక్టు ముంపులో భాగంగా గ్రామాన్ని ఖాళీ చేసిన తోయగూడ వాసులు బతుకు దెరువు కోసం.. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. మంచి భూములు, ఇళ్లను కోల్పోయి వివిధ ప్రాంతాల్లో స్ధిరపడ్డారు. ఎక్కడకు వెళ్లినా పుట్టిన గ్రామం తాలుకూ జ్ఞాపకాలు వారి మనసులో నుంచి వీడిపోలేదు. ఎక్కడెక్కడో నివాసం ఉన్న సుమారు 500 మందికిపైగా 40 ఏళ్ల తర్వాత ఖాళీ చేసిన గ్రామ శివారులో కలుసుకున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
దాహం తీర్చిన బావి, చదువుకున్న బడి ఆనవాళ్లను వారి పిల్లలకు చూపిస్తూ మురిసిపోయారు. గత జ్ఞాపకాలను పదిలపరుచుకునేలా చరవాణుల్లో స్వీయ చిత్రాలు తీసుకున్నారు. చిన్నా, పెద్ద తేడా మరిచి ఆడిపాడుతూ ఉత్సాహంగా గడిపారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత గ్రామస్థులంత కలిసి భోజనాలు చేసి ఆటపాటలతో ఆత్మీయతను పంచుకున్నారు. డప్పు వాయిద్యాల నడుమ గ్రామదేవతలకు పూజలు నిర్వహించారు.
అలాగే కోయిలకొండ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 1999-2000 సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో పాఠశాలలో చదువుకొన్న విద్యార్థులు పాఠశాలు చెప్పిన ఉపాద్యాయులను శాలువా, పూలమాలతో సత్కరించారు. 25 సంవత్సరాల తరువాత వివిధ హోదాలో స్థిరపడిన విధ్యార్థులు ఆనాటి రోజులు గుర్తుకు తెచ్చుకున్నారు. అనంతరం పాఠశాలకు ఫర్నీచర్ అందించారు. ఆపదలో ఉన్న విద్యార్థులు 17 మందికి ఆర్థిక సాయం అందించారు.
మరోవైపు ఆదిలాబాద్ జిల్లా, చింతలమానేపల్లి మండలంలోని బాబాసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1983-1984లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. ఈ అపూర్వ సమ్మేళనంలో 40 సంవత్సరాల తర్వాత ఒకే వేదిక పైకి చేరిన ఉపాధ్యాయులు,విద్యార్థులు తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఒకరినొకరు బాగోగులు అడిగి తెలుసుకున్నారు.