సత్యమేవ జయతే – గ్వాటెమాలా
ఓ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి వంతెనపైనుంచి లోయలో పడిపోయింది. దీంతో 50 మందికిపైగా మరణించగా, పలువురు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఓ ప్రయాణికుల బస్సు ఆకస్మాత్తుగా 35 మీటర్ల ఎత్తు నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 55 మంది మరణించారు. గ్వాటెమాల రాజధాని శివార్లలో సోమవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు వంతెనపై నుంచి జారిపడి మురుగు నీటి ప్రవాహం లోయలో పడిపోయింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 53 మృతదేహాలను వెలికితీశారు. మరొక ఇద్దరు శాన్ జువాన్ డి డియోస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు మృతిచెందారని అధికారులు తెలిపారు.
బాధితుల్లో పిల్లలు కూడా..
ప్రమాదం జరిగిన ప్రాంతంలో మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని అధికారులు వివరాలను వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది ఇంకా బస్సు నుంచి గాయపడిన వారిని బయటకు తీసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బస్సు రాజధానికి ఈశాన్యంగా ఉన్న ప్రోగ్రెసో నుంచి వచ్చిందని, బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారని అగ్నిమాపక అధికారి ఆస్కార్ సాంచెజ్ పేర్కొన్నారు. బస్సు ప్రోగ్రెసో అనే ప్రాంతం నుంచి బయలుదేరి గ్వాటెమాలా నగరానికి వెళ్లిపోతున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదానికి గురైంది.
దర్యాప్తు..
ప్రోగ్రెసో రాజధాని గ్వాటెమాలా నగరానికి ఈశాన్యంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. ఈ బస్సులో చాలా మంది ప్రయాణికులు స్థానిక ప్రజలుగా చెబుతున్నారు. గ్వాటెమాలా అధ్యక్షుడు బెర్నార్డో అరేవాలో ఈ ఘోర ప్రమాదం గురించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన తక్షణం బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలపడంతో పాటు, జాతీయ సంతాప దినాన్ని ప్రకటించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదానికి బాధ్యులైనవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.