Friday, March 14, 2025
ads
Homeఅలంకరణపల్లె పోరుకు సిద్ధం! పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం...

పల్లె పోరుకు సిద్ధం! పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధం

సత్యమేవ జయతే – హైదరాబాద్
– ఎన్నికలెప్పుడొచ్చినా సజావుగా నిర్వహించేలా కసరత్తు

– బ్యాలెట్‌ బాక్సులు, పత్రాలు సమకూర్చేపనిలో నిమగ్నం

– పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది ఎంపిక, శిక్షణపై దృష్టి


– జిల్లాలకు చేరిన ఎన్నికల గుర్తులు

– సర్పంచ్‌కు 30.. వార్డు సభ్యులకు 20

– రాష్ట్రంలో 12,848 పంచాయతీలు..

హైదరాబాద్ : పల్లె పోరుకు అధికార యంత్రాం గం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్‌ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది. సిబ్బం ది ఎంపిక, వారికి శిక్షణ, పోలింగ్‌ కేంద్రాల గుర్తిం పు, ఎన్నికల గుర్తులు తదితర అంశాలపై అధికారులు కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇందు లో భాగంగా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధులను కేటాయించారు. తెలంగాణ లో గ్రామాల సంఖ్య పెరగడంతో బ్యాలెట్‌ బాక్సుల అవసరం మరింత ఏర్పడింది. అందుకే పక్క రాష్ర్టాల నుంచి బాక్సులు తెప్పిస్తున్నారు. అలాగే, గ్రామాలు, వార్డుల వారీగా కావాల్సిన బ్యాలెట్‌ పత్రాల అవసరాన్ని అంచనా వేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తయ్యింది. ఇక, ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి ఉపాధ్యాయులతోపాటు ఇతర శాఖల ఉద్యోగులను గుర్తించారు. పలుచోట్ల సిబ్బందికి శిక్షణ కొనసాగుతోంది. ఇక, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే గుర్తులు కూడా సిద్ధమైనట్టు సమాచారం.
పంచాయతీ గుర్తులివే..

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తులపై తుది కసరత్తు పూర్తయ్యింది. సర్పంచ్‌ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులను ఆమోదించినట్లుగా తెలుస్తోంది. దాదాపు ఇవే గుర్తులు ఖరారయ్యే అవకాశం ఉంది.

సర్పంచ్‌ గుర్తులు:

ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్‌బాల్‌, లేడీ పర్సు, టీవీ రిమోట్‌, టూత్‌ పేస్టు, స్పానర్‌(పానా), చెత్త డబ్బా, బ్లాక్‌ బోర్డు, బెండకాయలు, కొబ్బరితోట, వజ్రం, బకెట్‌, డోర్‌ హ్యాండిల్‌, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్‌, బ్యాటరీ లైట్‌, బ్రష్‌, క్రికెట్‌ బ్యాటర్‌, పడవ, బిస్కెట్‌, పిల్లనగ్రోవి, చైను, చెప్పులు, బెలూన్‌, క్రికెట్‌ వికెట్లు

వార్డు సభ్యుల గుర్తులు

గౌను, గ్యాస్‌స్టవ్‌, స్టూల్‌, గ్యాస్‌ సిలిండర్‌, బీరువా, విజిల్‌, కుండ, డిష్‌ యాంటీనా, గరాటా, మూకుడు, ఐస్‌క్రీం, గాజుగ్లాసు, పోస్టు డబ్బా, ఎన్వలప్‌ కవర్‌, హాకీ స్టిక్‌ మరియు బంతి, నెక్‌ టై, కటింగ్‌ ప్లేయర్‌, పెట్టె, విద్యుత్‌ స్తంభం, కెటిల్‌.

రిజర్వేషన్లపై ఉత్కంఠ..

రాష్ట్రంలోని పల్లెల్లో ప్రస్తుతం ఎన్నికల రిజర్వేషన్లే హాట్‌టాపిక్‌గా మారాయి. సామాజిక వర్గాల వారీగా ఆశావహులు పోటీకి సిద్ధమయ్యారు. పం చాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించకుం టే స్థానిక ఎన్నికల వైపు గురిపెడుతున్నారు. పం చాయతీ ఎన్నికల్లో సగం దాకా మహిళా రిజర్వేషన్లు ఉండడంపైనా తర్జనభర్జన పడుతున్నారు. అయితే, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయా గ్రా మాల్లో సామాజికవర్గాల జనాభాశాతం, మహిళల సంఖ్యతోపాటు గతంలో వరుసగా మూడుసార్లు వచ్చిన రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా తెలిసింది. గతసారి వచ్చిన రిజర్వేషన్‌ ఈసారి మారవచ్చని అంటున్నారు. తమ గ్రామానికి ఫలానా రిజర్వేషన్‌ను కేటాయించాలని అధికారులకు వినతిపత్రాలు కూడా అందజేస్తున్నారు.

మొత్తంగా ఎన్నికల కోడ్‌ వెలువడకముందే రిజర్వేషన్ల అంశం పల్లెల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 12,848 గ్రామ పంచాయతీలను గుర్తించింది. వీటన్నింటికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదిక వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. దాని ప్రకారం మొత్తం 12,848 గ్రామ పంచాయతీల్లో 5,817 ఎంపీటీసీ స్థానాలుండగా, 570 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 868 గ్రామ పంచాయతీలు ఉండగా అక్కడ 352 ఎంపీటీసీ స్థానాలు, 33 జడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇక, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ జిల్లాలో 19 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి.

ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం

రాష్ట్రంలోని పంచాయతీల వివరాలు

జిల్లా గ్రామపంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు

ఆదిలాబాద్‌ 473 166 20

భద్రాద్రి కొత్తగూడెం 478 236 22

హన్మకొండ 210 129 12

జగిత్యాల 385 216 20

జనగాం 280 134 12

భూపాలపల్లి 248 109 12

జోగులాంబ గద్వాల 255 142 13

కామారెడ్డి 536 237 25

కరీంనగర్‌ 318 170 15

ఖమ్మం 579 288 20

అసిఫాబాద్‌ 335 127 15

మహబూబాబాద్‌ 482 193 18

మహబూబ్‌నగర్‌ 423 175 16

మంచిర్యాల 306 129 16

మెదక్‌ 492 190 21

మేడ్చల్‌ మల్కాజిగిరి 34 19 3

ములుగు 174 87 10

నాగర్‌కర్నూల్‌ 460 214 20

నల్లగొండ 868 352 33

నారాయణపేట 276 136 13

నిర్మల్‌ 400 157 18

నిజామాబాద్‌ 545 307 31

పెద్దపల్లి 266 140 13

రాజన్న సిరిసిల్ల 260 123 12

రంగారెడ్డి 531 232 21

సంగారెడ్డి 633 276 27

సిద్దిపేట 508 230 26

సూర్యాపేట 486 235 23

వికారాబాద్‌ 594 227 20

వనపర్తి 268 133 15

వరంగల్‌ 317 130 11

యాదాద్రి భువనగిరి 428 178 17

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments