Friday, March 14, 2025
ads
Homeఅలంకరణకాలికి నల్లదారం ఎందుకు కట్టుకుంటారో తెల్సా.? ఎలాంటి ఫలితాలు...

కాలికి నల్లదారం ఎందుకు కట్టుకుంటారో తెల్సా.? ఎలాంటి ఫలితాలు ఇస్తాయంటే

చాలామంది కాళ్లకు నల్లదారం కట్టుకోవడం చూసే ఉంటారు. ఇవి ఒకప్పటి ఆచారాలు కాగా.. ఇప్పుడు వీటిని కొందరు స్టైల్‌ కోసం ధరిస్తుంటారు. కొందరు మాత్రం జ్యోతిష్య కారణాల వల్ల కాలికి నల్లదారం కట్టుకుంటారు. అయితే మన ఆచారం ప్రకారం చాలామంది నల్లదుస్తులను ధరించడానికి ఇష్టపడరు.
చాలామంది కాళ్లకు నల్లదారం కట్టుకోవడం చూసే ఉంటారు. ఇవి ఒకప్పటి ఆచారాలు కాగా.. ఇప్పుడు వీటిని కొందరు స్టైల్‌ కోసం ధరిస్తుంటారు. కొందరు మాత్రం జ్యోతిష్య కారణాల వల్ల కాలికి నల్లదారం కట్టుకుంటారు. అయితే మన ఆచారం ప్రకారం చాలామంది నల్లదుస్తులను ధరించడానికి ఇష్టపడరు. అలా నల్లదుస్తులు ధరించడం వల్ల చెడు జరుగుతుందని భావిస్తారు. ఇక కాళ్లకి నల్లదారం కట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నల్లదారం అందరికీ సెట్ కాదట. దాన్ని అందరూ వాడకూడదట. నల్లదారం వాడేందుకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ నిబంధనలను పట్టించుకోకపోతే జీవితంలో అభివృద్ధి సంగతి అటుంచితే.. అన్నింటా నెగటివ్ ఎనర్జీ తప్పదట.

ఇంతకీ అసలు నల్లదారం ఎందుకు కట్టుకుంటారు?

సాధారణంగా నలుపు రంగు శనిశ్వరునికి ప్రతీక. నలుపు దారాన్ని ధరించే ముందుగా శనిదేవునికి నమస్కరించి ఏదైనా ప్రత్యేక రోజుల్లో వాటిని కట్టుకుంటారు. ఈ దారాన్ని ధరించడం ద్వారా ఆ శనిశ్వరుని అనుగ్రహం కలిగి శని నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ నల్లదారాన్ని ధరించిన తర్వాత గాయత్రి మంత్రాన్ని పఠించాలని పెద్దలు అంటారు. ఈ నల్లటి దారాలను స్త్రీలు ఎడమకాళ్లకి, పురుషులు కుడికాళ్లకి ధరిస్తుంటారు. ఇలా ధరించడం వల్ల కొన్ని దుష్టశక్తుల నుంచి మనల్ని దూరంగా ఉంచడానికి ఉపయోగపడుతుందట. ఎవరైతే చేతి మణికట్టుకు పసుపు, ఎరుపు, నారింజ రంగులతో కలిసి ఉన్న దారాలను కట్టుకొని ఉంటారో.. వారు తమ మణికట్టుకు నల్లదారాన్ని ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments