Friday, March 14, 2025
ads

కేసీఆర్

సత్యమేవ జయతే – తెలంగాణ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) చరిత్ర సృష్టించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఈ సారి విజయం సాధించి సీఎంగా హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఉద్యమమే ఊపిరిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు కేసీఆర్. ప్రస్తుత ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. తనకు రూ.58.92 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిడ్‌లో కేసీఆర్ వెల్లడించారు. అయితే తన పేరిట కారు లేదని తెలిపారు.

మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మించారు. సిద్ధిపేట డిగ్రీ కాలేజీలో బీఏ, ఉస్మానియి యూనివర్సిటీలో ఎంఏ (తెలుగు సాహిత్యం) చదువుకున్నారు. 1969లో శోభను వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఉన్నారు.

తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. 70వ దశకంలో యువజన్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ ప్రవేశం చేశారు. 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 1983లో తన రాజకీయ గురువు అనంతుల మదన్‌ మోహన్‌(కాంగ్రెస్)పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ.. ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments