– బీసీ,ఎస్సీ,ఎస్టీ ల జనాభా తగ్గినట్లు చూపుతూ ఓసిల జనాభా పెరుగుదల ఎలా సాధ్యపడింది
– రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి
– బిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నాయకురాలు దాసరి ఉష గారు
సత్యమేవ జయతే – పెద్దపల్లి
మన దేశంలో జనాభా :
లెక్కలను ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి చేస్తారని జనాభా ప్రాతిపదికన లెక్కించిన ప్రతీ సారి జనాభా శాతం పెరుగుతుంటుంది, కాని మన తెలంగాణలో కులగణన చేసినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ ల జనాభా తగ్గి కేవలం ఓసి ల జనాభా మాత్రం పెరిగే విధంగా కులగణన చేయడం జరిగిందని బి ఆర్ ఎస్ నాయకురాలు దాసరి ఉష గారు అన్నారు. ఈ విధమైన కులగణన సరియైనదా కాదా అనే అనుమాలున్నాయని తెలిపారు. ఇది సరియైనది కానప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఈ ప్రభుత్వం జవాబు చెప్పవలసిన అవసరం ఉందని తెలిపారు. అదేవిధంగా బీసీలు ఎందరున్నా ఎలక్షన్ మానిఫెస్టో లో కేవలం 42% మాత్రమే రిజర్వేషన్ ను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారని మరీ 56.3% జనాభా కి 42% ఇవ్వడం సరికాదని, మేం ఎంతో మాకంత రావాలిసిందేనని మండిపడ్డారు. అదేవిధంగా ఓబీసీ లకి విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లో మా జనాభా అనుగుణంగా రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. మరీ దాని గురుంచి మాట్లాడిందే లేదని అన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో చేసిన డేటాను చెప్పడేమా..! కార్యాచరణ చేయడానికి తావు ఉందా లేదా అని ప్రశ్నించారు.