సత్యమేవ జయతే- సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గంగారం టేకులపల్లి మధ్యలో ఉన్నటువంటి ఎత్తైన కొండపైన ఈ నెల 8,9వ తేదీన జరగబోయే పరిశుద్ధ శిలువకుంట జాతర మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర టిజీఐఐసీ చైర్మన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి గారిని గంగారం గ్రామ జాతర కమిటీ సంఘ పెద్దలు జాతర భావన పత్రిక ఇచ్చి జాతరకు రావాలని ఆమెను కోరారు. ఈ కార్యక్రమంలో గంగారం గ్రామ సంఘ పెద్దలు వనపర్తి భాస్కర్, వనపర్తి కిరణ్ కుమార్, ఇ. రవి, రమేష్ లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు, సంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు చిలకమర్రి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ గంగారం గ్రామ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, కొండాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ భోజనం అధ్యక్షుడు అశోక్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.