డబ్బులు ఉంటేనే డెలివరీ రావాలి లేకుంటే వెళ్లిపోవాలి
-డబ్బులు ఇస్తేనే డెలివరీ లేకుంటే రిఫర్ టు సంగారెడ్డి
కొడుకు పుడితే 5000 బిడ్డే కొడితే 3000 ఇవ్వాల్సిందే డబ్బులు
-కొండాపూర్ ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితి ఇది.
-పట్టించుకోని ప్రభుత్వ అధికారులు ఇబ్బందుల్లో రోగులు
కొండాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరీ కావాలి అంటే కంపల్సరి డబ్బులు ఇవ్వాల్సిందని డెలివరీ వచ్చిన వారి దగ్గర నుండి అక్రమంగా 3000 రూ,, వసూళ్లు చేసిన సిస్టర్స్ అటెండర్స్ వారిపైన చర్య తీసుకోవాలని ఈరోజు సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న మెడికల్ ఆఫీసర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది*
*ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం యాదగిరి మాట్లాడుతూ* కొండాపూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో గత మూడు రోజుల క్రితం డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే డెలివరీ అయిన తర్వాత సిస్టర్స్ మరియు అటెండర్స్ మాకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తే వాళ్ల దగ్గర ఉన్న 2500 రూపాయలు ఇస్తే మాకు 2500 రూపాయలు మాకు వద్దు అనడంతో వాళ్లు మళ్లీ ఇంటికి పోయి మళ్లీ డబ్బులు తెచ్చి 3000 రూపాయలు ఇస్తేనే తప్ప బేబీని ఇవ్వడం జరిగింది జరిగిందని ఆయన అన్నారు ఇలాంటి పరిస్థితి కొండాపూర్ మండల కేంద్రంలో ఏర్పడ్డదని అన్నారు అక్రమంగా రోగులనుండి డబ్బులు వసూలు చేస్తున్న సిస్టర్స్ పైన చర్య తీసుకోకుండా నిర్లక్ష్యంగా జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు డబ్బులు ఇస్తేనే ఆరోజు బేబీని చూపించడం జరిగిందని అన్నారు డబ్బులు ఇవ్వకుంటే బేబీని చూపించలేని పరిస్థితి ఏర్పడ్డదని అన్నారు డబ్బులు లేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ ఉన్న సిస్టర్స్ అటెండర్లు డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని అన్నారు పేదలు హాస్పిటల్లో పేదలు పోవాలి కానీ ఇక్కడ డబ్బులు ఉంటేనే పోవాల్సి వస్తుందని అన్నారు సిస్టర్స్ అటెండర్ నెల నెల జీతాలు వస్తున్నాయి కానీ కక్కుర్తి పడి డబ్బులుసులు తీసుకోవడం ఏంటని ఆయన అన్నారు అన్నారు పేద ప్రజల నుండి అక్రమంగా బెదిరించి డబ్బులు వసూళ్లు చేసిన సిస్టర్ల ,అటెండర్ లని ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు డబ్బులుంటే ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తారు కానీ పేదవాళ్లే ప్రభుత్వాసుపత్రికి వస్తే డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని అన్నారు కొడుకు పుడితే 5000 రూపాయలు బిడ్డే పుడితే 3000 రూపాయలు ఇవ్వాల్సిందని సిస్టర్స్ కొండాపూర్ ప్రభుత్వ హాస్పిటల్ లో డిమాండ్ చేస్తున్న అయినా జిల్లా అధికారులు వాళ్లపైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు ఇలా డబ్బులు పేదల నుండి వసూళ్లు చేస్తున్న సిస్టర్స్ పైన చట్టపైన మన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాట నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే రాజయ్య సీఐటీయూ మండల కార్యదర్శి బాబురావు సిపిఎం పార్టీ నాయకులు అర్జున్, అనిల్, శివ తదితరులు పాల్గొన్నారు.