Friday, March 14, 2025
ads
HomeUncategorizedమది నిండా సాయి నామం…!

మది నిండా సాయి నామం…!

  • రేపు ఇచ్చోడలో సాయి బాబా 25 వ వార్షికోత్సవం
  • ఘనంగా ఏర్పాట్లు.. తరలి రానున్న భక్త జనం
  • ఆలయ కమిటీ ఐకమత్యంతో, దాతల సహాయంతో దినాదినం అభివృద్ధి చెందుతున్న ఆలయం
  • ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం
  • మహారాష్ట్ర నుండి సైతం తరలిరానున్న భక్తులు

వాస్తవ నేస్తం,ఇచ్చోడ : మనసే హారతి…షిరిడి శ్రీపతి…అభయం కోరితి… విజయం వేడితి.. పా… హిమాం.. దయగల ఓయి సాయిరాం.. అంటూ భక్తులు నిత్యం మది నిండా జపిస్తున్నారు. మండల కేంద్రమైన ఇచ్చోడలోని సాయిబాబా ఆలయం ఆధ్యాత్మికంగా విరాజిల్లుతోంది.. వసంత పంచమి పర్వ దినంను పురస్కరించుకుని సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 25 వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. అదే రోజు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ వార్షికోత్సవ వేడుకలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా మహారాష్ట్ర నుండి సైతం భక్తులు తరలిరానున్నారు.

ఈ రోజు పవిత్ర దినం..

భక్తులు వసంత పంచమిని పవిత్ర దినంగా భావిస్తారు. షిర్డీలోని సాయి నాథుడు ఇచ్చోడ ఆలయంలో కొలువుదీరి ఉన్నాడని నమ్మకం. ఆలయంలో ఈ రోజున ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు ఆ సాయి నాథుడు తీరుస్తాడని భక్తుల విశ్వా సం. సాయి నాథుడి దర్శనం కోసం బోథ్, అదిలాబాద్ నియోజక వర్గాల నుంచి భక్తులు తరలిరానున్నారు. వార్షికోత్సవం నేపథ్యంలో సాయిబాబా, హను మాన్, మహా లక్ష్మీ ఆలయాలకు రంగు రంగులతో అలంకరించారు. విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు.

తొమ్మిది ఏళ్లుగా అన్నదానం…

సాయి బాబా ఆలయంను 2000 సంవత్సరం జనవరిలో ప్రారంభించారు. 2017 నుంచి ఆలయంలో ప్రతి గురువారం అన్న దానం నిర్వహిస్తున్నారు. మొదట్లో 5 కిలోల బియ్యంతో అన్నదానం ప్రారంభమై నేడు 1 క్వింటాలు బియ్యం పైనే ఉచిత అన్నదానం నిర్వరామంగా కొనసాగుతోంది. అన్నదానం చేసే భక్తులు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ మహా ప్రసాదంను స్వీకరించేందుకు వందలాది మంది భక్తులు వస్తుండడంతో ఆలయం ప్రాంగణం భక్తి తో పులకించిపోతోంది

పూజ కార్యక్రమాలు…

ఉదయం 5 గంటలకు కాకాడ హారతి. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు హోమం. ఉదయం 8 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల వరకు పట్ట ణంలోని ప్రధాన వీధుల గూండా సాయి పల్లకి శోభ యాత్ర. 12:30 లకు అన్నదానం. బబ్రూ మహారాజ్ (గంగపూర్) ఆధ్వర్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక భజన కార్యక్రమం,సంకీర్తనలు, ప్రవచ నాలు నిర్వహిస్తారు.

అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి..

  • గూడూరు ముత్యం రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షులు ఇచ్చోడ

ప్రతి ఏటేటా వసంత పంచమి రోజు సాయి బాబా ఆలయం వార్షికోత్సవ వేడుకలను అందరి సహకారం తో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రత్యేక వలంటీర్లను నియమించాం. ఈ వేడుకలకు అదిలాబాద్, బోథ్, ఇచ్చోడ, గుడిహత్నూ ర్, నేరడిగొండ, బజార్ హత్నూర్, సిరికొండ, సొనాల మండలాల నుంచి సుమారు 25 వేల మంది భక్తులు వస్తున్నారు. పోలీస్ బందోబస్తిని ఏర్పాటు చేయడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments