వాస్తవ నేస్తం,పలిమెల: మండలంలోని సర్వాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో జాతీయ కుష్టు నివారణ దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకొని జనవరి 30 తారీఖు నుండి ఫిబ్రవరి 13వ తారీకు వరకు పక్షం రోజులు లెప్రసీ పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది కుష్టు వ్యాధి అనేది మైక్రో బ్యాక్టీరియా లెప్రే అనే బ్యాక్టీరియా వలన వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి సోకుతుంది. ఇది ఒకరిని ముట్టుకోవడం వలన చేతులు కలపడం వలన రాదని, కుష్టి వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షతో చూపించకుండా ఉండాలని, కుటుంబ సభ్యులు సన్నిహితులు ఇరుగుపొరుగు వారికి ఎవరికైనా శరీరంపై స్పర్శ లేని అనుమానిత మచ్చలు ఉన్నట్లయితే సమీపంలోని వైద్య సిబ్బందికి కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ పంపించి పరీక్షలు చేపించుకొని సలహాలు తీసుకోవాలని అన్నారు. కుష్టు వ్యాధి నిర్ధారణ అయినట్లయితే వారికి ఉచిత మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కుష్టి వ్యాధి పట్ల అలసత్వం చేస్తే మందులు వాడన్నట్లయితే అంగవైకల్యనికి గురవుతారని అన్నారు. కార్యక్రమంలో హెచ్ఈఓ సోనాజి, సూపర్వైజర్లు మాషూక్ అలీ, హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ, ల్యాబ్ టెక్నీషియన్ చంద్రమోహన్, సరస్వతి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
