వాస్తవ నేస్తం,బోథ్: ఆల్ ఇండియా పద్మశాలి ఎంప్లాయిస్(పోప) చైర్మన్ కుంటాల గంగాధర్ తిలక్ ను శుక్రవారం జిల్లా కేంద్రంలో మండల పద్మశాలి సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మార్కండేయ జయంతి ఉత్సవాలను ఘనంఘ జరుపుకోవాలని గంగాధర్ తిలక్ సూచించారు. కార్యక్రమంలో బోథ్ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుడు గంగుల మల్లేష్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సిరిపురం చంద్రమోహన్, సంఘం ఉపాధ్యక్షుడు ఆడేపు కిరణ్, తదితరులు ఉన్నారు.
