– ఈ నిర్లక్ష్య దొరనికి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బింది కారణమా దీనికి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ..
సత్యమేవ జయతే – సంగారెడ్డి
సంగారెడ్డి : సమయానికి 108 అంబులెన్స్ రాకపోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బస్వాపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల వెంకటేశం(32) పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, స్నేహితులు 108 అంబులెన్స్‌కు ఫోన్ కాల్ చేయగా, చాలాసేపటి వరకు కూడా అది రాకపోవడంతో.. బైక్‌పైనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు స్నేహితులు. 40 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించి ఆస్పత్రికి చేరేలోగా వెంకటేశం ప్రాణాలు కోల్పోయాడు. సమయానికి 108 అంబులెన్స్ వస్తే వెంకటేశం ప్రాణాలతో బతికేవాడని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు.