Thursday, August 14, 2025
ads
Homeఆరోగ్యంయోగా డేన శీర్షాసనం, పద్మాసనం..

యోగా డేన శీర్షాసనం, పద్మాసనం..

పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా వేడుకగా జరుగుతోంది. పలు దేశాల ప్రముఖులు యోగాసనాలు వేస్తూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. భారత్‌లో పెద్ద సంబురంలా యోగా డే సాగుతున్న వేళ.. నార్వే దౌత్యాధికారి సైతం ఆసనాలు వేస్తున్న ఫొటోలను ఆన్‌లైన్‌లో పంచుకున్నారు. ఇండియాలో ఆ దేశ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మే ఎలిన్ స్టెనెర్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా రెండు కఠినమైన ఆసనాలు వేసింది.

నిరుడు మే ఎలిన్ భారత్‌లో నార్వే దౌత్యాధికారిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి మనదేశ సంస్కృతి, సంప్రదాయాల మీద ఇష్టం పెంచుకున్న ఆమె.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పునస్కరించుకొని ఆసనాలు వేశారు. వీటిలో ఒకటి శీర్షాసనం కాగా.. శీర్షాసనంలో ఉంటూనే ఆమె పద్మాసనం కూడా వేయడం విశేషం. ‘శీర్షాసనం వేసిన తీరు.. అది ఎలా ముగిసిందో చూడండి’ అంటూ తన ఫొటోలను పంచుకున్నారామె.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments