Thursday, August 14, 2025
ads
Homeగాడ్జేట్స్థాయిలాండ్‌కు ఉన్న క‌నీస జ్ఞానం కూడా రేవంత్ రెడ్డికి...

థాయిలాండ్‌కు ఉన్న క‌నీస జ్ఞానం కూడా రేవంత్ రెడ్డికి లేక‌పాయె : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ లీడ‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మ‌రోసారి తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసుపై ఆర్ఎస్పీ మ‌రోసారి స్పందించారు. ఈ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసి విచార‌ణ చేప‌ట్ట‌డాన్ని మ‌రోసారి త‌ప్పుబ‌ట్టారు.

పక్కన ఉన్న థాయిలాండ్‌కు ఉన్న కనీస జ్ఞానం కూడా తెలంగాణ కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్ రెడ్డికి లేక‌పాయె అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పేర్కొన్నారు. థాయిలాండ్ దేశం 1.2 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఫార్ములా-1 రేసు తమ దేశానికి తెచ్చుకుంటున్నారు అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. మాజీ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ మీకన్నా 50 సంవ‌త్స‌రాలు ముందర ఆలోచించారు అని ఇప్పుడైనా మీ చిన్న బుర్రలకు అర్థం ఐతదనుకుంటా. మీ దుష్ట పాలన ఎప్పుడు అంతమైతదా అని తెలంగాణ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నది అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments