Saturday, June 7, 2025
ads
Homeఆంధ్ర ప్రదేశ్ఇక నాన్ స్టాప్ వానలే వానలే.. వచ్చే 3...

ఇక నాన్ స్టాప్ వానలే వానలే.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.. మరో మూడు రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనావేసింది. ఈదురు గాలులతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 5°ఉత్తర అక్షాంశం/60°తూర్పురేఖాంశం, 7°ఉత్తర అక్షాంశం/70°తూర్పురేఖాంశం,7°ఉత్తర అక్షాంశం / 75°తూర్పురేఖాంశం, 10°ఉత్తర అక్షాంశం / 81°తూర్పురేఖాంశం, 13°ఉత్తర అక్షాంశం /84.5°తూర్పురేఖాంశం. మరియు 16°ఉత్తర అక్షాంశం / 88°తూర్పురేఖాంశం,19.5°ఉత్తర అక్షాంశం / 91 °తూర్పురేఖాంశం – 23°ఉత్తర అక్షాంశం /95°తూర్పురేఖాంశం వరకు కొనసాగుతున్నది..

రాబోయే 2-3 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

ఇదే కాలంలో దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాలు; లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు; కేరళ, కర్ణాటక, తమిళనాడు; దక్షిణ & మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

మే 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి రెండు రోజుల్లో ఇది మరింతగా బలపడే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి/ పశ్చిమ దిశగా గాలులు వీస్తాయి.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచనలు:
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-

గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

గురువారం భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 50 -60 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50కి .మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి .మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:-

గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

గమనిక :- రాగల 7 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పులేదని అమరావతి వాతావరణ కేంద్రము సంచాలకులు ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments