Saturday, June 7, 2025
ads
Homeజిల్లాలుశ్రీ ధన బోయిన మల్లేష్ యాదవ్ ఉద్యోగ విరమణ...

శ్రీ ధన బోయిన మల్లేష్ యాదవ్ ఉద్యోగ విరమణ మరియు క్రిసిర పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్


సత్యమేవ జయతే – హైదరాబాద్
హైదరాబాద్ : హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ న్యూ గచ్చిబౌలి గౌలిదొడ్డి విప్రో సర్కిల్ రోడ్ హ్యుందాయ్ కార్ షోరూమ్ వెనకాల ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో శ్రీ ధన బోయిన మల్లేష్ యాదవ్ ఉద్యోగ విరమణ కార్యక్రమం మరియు వారి ముద్దుల మనవరాలు క్రిసిర పుట్టినరోజు ఫంక్షన్ నిర్వహించడం జరిగింది. మే 2025 ఆరవ తేదీన శ్రీమతి శ్రీ ధన బోయిన రమ్య వికేష్ యాదవుల ముద్దుల కూతురు క్రిసిర పుట్టినరోజు శ్రీమతి శ్రీ ధన బోయిన శారద మల్లేష్ యాదవుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ గారు పాల్గొని క్రిసిర కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మరియు అదే క్రమంలో ధనభోయిన మల్లేష్ యాదవ్ కు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారి క్రిసీరా ను ఉన్నత శిఖరాలను ఎదగాలని హాయిగా ఆడుతూ పాడుతూ పెరగాలని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని ఆశీర్వదించారు. ఉద్యోగ విరమణ పొందిన రాష్ట్ర బీసీ నాయకులు సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఎంప్లాయ్ అసోసియేషన్ కీలక పాత్ర పోషించారు ఎంప్లాయ్ ఇలా న్యాయమైన డిమాండ్ల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. శ్రీ ధన బోయిన మల్లేష్ యాదవ్ గారి సేవలను కొనియాడారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్యోగ సంఘాల మాజీ అధ్యక్షులు దానబోయిన పరశురాం యాదవ్, ఉద్యోగ సంఘాల సీనియర్ నాయకులు మురళి యాదవ్, పాములేటి యాదవ్, మేకల కృష్ణ యాదవ్, సోమయ్య యాదవ్, బండా యాదయ్య యాదవ్, నాగపురి కృష్ణ యాదవ్, నాగపురి అశోక్ యాదవ్, మరియు దానబోయిన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments