– నర్షింహులపేట తహశీల్దార్ పి నాగరాజు
సత్యమేవ జయతే – మహబూబాబాద్
మహబూబాబాద్ :- ప్రగతి సేవాసమితి ఆద్వర్యంలో ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహించడం అభినందనీయం అని నర్షింహులపేట మండల తహశీల్దార్ పి నాగరాజు అన్నారు.బుధవారం మహబూబాబాద్ జిల్లా నర్షింహులపేట మండల కేంద్రంలోని స్థానిక వెలుగు కార్యాలయ ఆవరణలో ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్షింహులపేట మండల తహశీల్దార్ పి నాగరాజు, అతిథులుగా ఎంపీడీఓ యాకయ్య, ఎస్సై మాలోత్ సురేష్,ప్రగతి సేవాసమితి వ్యవస్థాపకులు గద్దల జాన్, మాజీ జడ్పీ చైర్మన్ మెరుగు సత్యనారాయణ, పల్లె దవాఖాన ఆఫీసర్ అన్వేష్ లు పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి క్యాంప్ ను ప్రారంభించారు.ఈసందర్భగా వారు మాట్లాడుతు ప్రగతి సేవాసమితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత ముప్పై ఏండ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక,ఆర్ధిక అక్షరాస్యత కోసం పనిచేస్తుందని తెలిపారు. ప్రగతి సేవాసమితి వ్యవస్థాపకులు గద్దల జాన్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రగతి సేవాసమితి ఆర్ధిక అక్షరాస్యత తోపాటు విద్య, వైద్యం, వృత్తి నైపుణ్య శిక్షణతోపాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ ఉచిత కంటి వైద్య శిభిరంలొ 92 మందికి పరీక్షలు చేయగా 42 మంది ని శంకర కంటి ఆసుపత్రి హైద్రాబాద్ కు ఆపరేషన్ కోసం పంపామని తెలిపారు.ఈకార్యక్రమంలో ప్రగతి సేవా సమితి ప్రోగ్రాం ఆఫీసర్ గద్దల రామ్మూర్తి , ఫైనాన్స్ మేనేజర్ రాజ్ కుమార్, క్యాంప్ నిర్వహణ మరియు తొర్రూరు క్లస్టర్ కో ఆర్డినేటర్ చెడుపాక వెంకన్న,మహబూబాబాద్ క్లస్టర్ కో ఆర్డినేటర్ ఐనాల పరశు రాములు, నర్షింహులపేట మండల కో ఆర్డినేటర్ దుడ్డేల సుష్మిత,మరిపెడ మండల కో ఆర్డినేటర్ జినక సువార్త, చిన్నగూడూరు మండల కో ఆర్డినేటర్ బర్పటి రాధ, ప్రగతి సొసైటీ మాజీ అధ్యక్షురాలు పుప్పాల ఉమాదేవి, ఐకెపి సిబ్బంది సత్యనారాయణ, మల్సూర్, సమ్మయ్య, నర్సయ్య, భీముడు,ఏఎన్ఎం కృష్ణవేణి, ఆశ వర్కర్ లు వెంకటలక్ష్మి, జ్యోతి, సరస్వతి,ప్రగతి సేవా సమితి విలేజ్ కో ఆర్డినేటర్ లు కృష్ణమూర్తి, తుల్సా నాయక్,సతీష్ , సంద్య, మంజుల, శిరీష, శంకర కంటి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.