సత్యమేవ జయతే – హైదరాబాద్ హైదరాబాద్ : ఏప్రిల్ 13న నిర్వహించాల్సిన తెలంగాణ మాడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షను 20కి వాయిదావేసినట్టు మాడల్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీనివాసచారి తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 10తో ముగియనుండగా, ఈ నెల 20 వరకు పొడిగించినట్టు తెలిపారు. ఏప్రిల్ 15న హాల్‌టికెట్లను విడుదల చేస్తామని, 20న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు, మధ్యాహ్నం 2నుంచి 4 గంటల వరకు 7వ తరగతి నుంచి 10వ తరగతిలోని ఖాళీల భర్తీకి ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 33,892 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు.