Saturday, March 15, 2025
ads

నేడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక?

సత్యమేవ జయతే హైదరాబాద్:మార్చి 09
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థు లపై కసరత్తు పూర్తయింది నేడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయనుంది, కాగా చివరి నిమిషంలో తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన రద్దయింది.

కేసి వేణుగోపాల్ ఢిల్లీలో లేకపోవడంతో పర్యటన రద్దు అయింది ఇవాళ రాష్ట్ర అగ్ర నేతలతో ఫోన్లో కేసీ వేణుగోపాల్, మాట్లా డారు.ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్ లో భారీ పోటీ పెరిగింది, తమకే అవకాశం కల్పించాలంటూ ఆశవాహులు కోరుతున్నా రు.నేడు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ హై కమాండ్ ప్రకటించే అవకాశం ఉంది..

కాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠ నెలకొంది ఎమ్మెల్సీ ఓసి కేటగిరి నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహా రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమకుమార్, పేర్లు బలంగా వినిపిస్తున్నాయి….

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments