సత్యమేవ జయతే – హైదరాబాద్ హైదరాబాద్ : లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ శనివారం ఆలస్యంగా ప్రారంభమయ్యింది. సాయంత్రం 4గంటల తర్వాత దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు.
షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకావాల్సి ఉండగా, ఉదయం నుంచే అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పలేదు. ఎట్టకేలకు సాయంత్రం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. తొలిరోజు కేవలం 30 మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారు. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది.