Friday, March 14, 2025
ads
Homeఆరోగ్యం"వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

“వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

“వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

సత్యమేవ జయతే-సంగారెడ్డి
సంగారెడ్డి పట్టణంలోని వెల్నెస్ హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోహీర్ మండలం, మదిరి గ్రామానికి చెందిన మహానంది అనే మహిళ చికిత్స కోసం వెల్నెస్ హాస్పిటల్ చికిత్స కోసం వస్తే వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు, బంధులు ఆందోళన వ్యక్తం చేశారు.

మృతురాలి బంధువులు ఆగ్రహంతో ఆసుపత్రి వద్ద ఉన్న పూలతొట్టెలను ధ్వంసం చేసి, యాజమాన్యాన్ని నిలదీశారు. పోలీసులకు, బంధువులకు మ‌ధ్య‌ తీవ్ర తోపులాట జరిగింది. అధిక డబ్బులు వసూలు చేసుకొని వైద్యంలో నిర్లక్ష్యం చేయడం వల్లే మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ ను రద్దు చేయాలని, మృతిచెందిన కుటుంబానికి రూ.50లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆసుపత్రి ఎదుట పెద్దఎత్తున ఆందోళన”
చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments