సత్యమేవ జయతే – సిద్దిపేట
సిద్దిపేట : తెలుగు ప్రజలందరికీ బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ పరమశివుని ఆశీస్సులతో ప్రజలందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట శ్రీ ఉమా పార్థివ కోటిలింగాల దేవాలయంలో స్వామి వారిని బుధవారం ఉదయం హరీశ్‌రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. స్వామి వారి దయతో కేసీఆర్ నాయకత్వంలో ఈ ప్రాంతంలో కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కుతున్నాయని అన్నారు. ప్రజలందరిపై స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.
ఉపవాసాలు, జాగరణలతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మహా శివున్ని కొలిచే పర్వదినం మహా శివరాత్రి అని కేటీఆర్ అన్నారు. ప్రజలందరిపై ఆ మహాదేవుని కృపా కటాక్షాలు ఉండాలని ప్రార్థించారు. సమస్త భక్త జనకోటికి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.