సైబర్ నేరాలపై విద్యార్థులు అవ గాహన కలిగి ఉండాలి.
— కొండాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు
సత్యమేవ జయతే- కొండాపూర్
సైబర్ నేరాలపై విద్యార్థులు అవ గాహన కలిగి ఉండాలని కొండాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కొండాపూర్ మండలంలోని తొగరుపల్లి ప్రభుత్వ పాఠశాలలో సైబర్ నేరాలు పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండాపూర్ ఎస్‌ఐ హరిశంకర్ గౌడ్ మాట్లాడుతూ మొబైల్ ద్వారానే 80 శాతం సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. పెరుగుతు న్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు కొందరు అక్రమాలకు పాల్పడుతు న్నారని విద్యార్థులు అవగాహన పెంచుకుని ఇటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నా.రు. చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా జాగృతం చేయాలన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు.మహిళలు, చిన్న పిల్లలపై నేరాలు ఎక్కువయ్యాయన్నారు. విశృంకల పాశావికమైన ఆలోచనల విధానాల వలన ఇటువంటివి చోటు చేసుకుంటున్నా యని, వీటి కట్టడికి చట్టాల ద్వారానే కాక మానవుల మనస్సుల్లో మార్పు రావాలన్నారు.