Friday, March 14, 2025
ads
Homeక్రైమ్నిజామాబాద్‌ జిల్లాలో దారుణం.. అక్కాచెల్లెళ్లపై సామూహిక లైంగిక దాడి

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం.. అక్కాచెల్లెళ్లపై సామూహిక లైంగిక దాడి

సత్యమేవ జయతే – నిజామాబాద్‌ నిజామాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలంలోని దుబ్బాక ధనంబండ తండా అటవీ ప్రాంతంలో ఇద్దరు అక్కాచెళ్లెళ్లు సామూహిక లైంగిక దాడికి గురయ్యారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలంలోని దుబ్బాక ధనంబండ తండా అటవీ ప్రాంతంలో ఇద్దరు అక్కాచెళ్లెళ్లు సామూహిక లైంగిక దాడికి గురయ్యారు. ధర్పల్లి ఎస్సై జాడి రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన నలుగురు యువకులు నిజామాబాద్ పరిసర ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెళ్లెలును పరిచయం చేసుకుని ధనంబండ తండా నల్లగొండ నరసింహస్వామి ఆలయ సమీపానికి తీసుకొచ్చారు. వారిలో చెల్లెలుకు మద్యం తాగించి అఘాయిత్యానికి ఒడిగట్టారు. అక్క వారిని ప్రతిఘటించి అక్కడి నుంచి పరుగున రోడ్డుమీదకు వచ్చి కేకలు వేసింది. రోడ్డు వెంట వెళ్తున్న స్థానికులు గమనించి గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. బాధిత మహిళలు పూర్తిగా కోలుకున్న తరువాత వివరాలు తెలుస్తాయని ఎస్సై వెల్లడించారు. కాగా నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments