Friday, March 14, 2025
ads
Homeజిల్లాలుమహాశివరాత్రి బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు

మహాశివరాత్రి బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు


సత్యమేవ జయతే – హైదరాబాద్
శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయలు సహా 43 శైవక్షేత్రాలకు 24-28 వరకు స్పెషల్‌ సర్వీసులు
3 వేల బస్సులను నడపనున్న ఆర్టీసీ
సత్యమేవ జయతే – హైదరాబాద్
హైదరాబాద్‌: మహాశివరాత్రి నేపథ్యంలో 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను అదనపు ఛార్జీలతో నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సుల్లో 50 శాతం వరకు అదనంగా ఛార్జీలు వసూలు చేయనుంది. రెగ్యులర్‌ సర్వీసుల్లో మాత్రం సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది. ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో ఇటీవల ప్రత్యేక బస్సులపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమీక్షించి భక్తుల రద్దీ మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు. దీంతో శైవక్షేత్రాలకు నడిపే బస్సుల ప్రణాళికను ఆర్టీసీ యాజమాన్యం ఖరారు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 24 నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. ప్రధానంగా శ్రీశైలంకు 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సులతో పాటు అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులు వెళ్లనున్నాయి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్‌ సదన్, కేపీహెచ్‌బీ కాలనీ, బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతాల నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు బయల్దేరతాయి.

గతంలో జారీ చేసిన జీఓ ప్రకారమే ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఈ నెల 24నుంచి27వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలుంటాయి. ఏడుపాయలకు తిరిగే ప్రత్యేక బస్సుల్లో మాత్రం 26-28 వరకు వర్తిస్తాయని వివరించింది. 
మహాశివరాత్రికి నడిపే ప్రత్యేక బస్సుల్లో ప్రభుత్వ జీఓ ప్రకారం.. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణం ఉంటుందని సజ్జనార్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి వేములవాడ, శ్రీశైలం బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయానికి 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments