శనివారం ఉదయం నారాయణఖేడ్ శాసనసభ్యులు వారి నివాసంలో పట్టభద్రుల అభ్యర్థి ఆల్ఫోన్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. పత్రికాముఖంగా వారు సంక్షేమ ముఖ్యమంత్రికి విద్యావేత్త అయినటువంటి నన్ను చూసి ఓటు వేయగలరు ఈ పట్టబద్రుల ఎన్నిక చదువుకున్న వ్యక్తికి పారిశ్రామిక వ్యక్తికి మధ్య జరుగుతున్న ఎన్నిక పట్టబద్రుల అంటేనే చదువుకున్న వాళ్ళు కాబట్టి చదువుకున్న వ్యక్తి అయినటువంటి నన్ను మొదటి ప్రాధాన్యత ఓటు వేయగలరు నేను మాత్రం చదువుకున్న వారికి ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతోనే ఈ ఎన్నికల్లో నిలబడ్డాను అలాగే వెనకబడ్డ నారాయణఖేడ్ ప్రాంతంలో కూడా శాసనసభ్యులు మరియు పార్లమెంటు సభ్యుల కోరిక మేరకు గెలిచిన తర్వాత స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలపడం జరిగింది అలాగే ఫీజు రిహాంబర్ మెంట్స్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి వద్దకు వెళ్లి వీలైనంత త్వరగా ఇవ్వడానికి కృషి చేస్తానని తెలపడం జరిగింది ఈ పత్రిక సమావేశంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి మరియు నారాయణఖేడ్ పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్ సేట్, వినోద్ పాటిల్ ఇతర కాంగ్రెస్ నాయకులు పట్టభద్రులు పాల్గొన్నారు