సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్జి మండలములోని నాగన్ పల్లి గ్రామమును నూతన మండలముగా ఏర్పడనున్న తడ్కల్ నందు చేర్చకుండా యథావిధిగా కంగ్టి మండలములో కొనసాగించుట లేదా ఇటీవల నూతన మండలముగా ఏర్పాటైన సిర్గాపూర్ నందు చేర్చుటకై విన్నపము.నారాయణఖేడ్ డివిజన్, కంగ్టి మండలములోని నాగన్ పల్లి గ్రామస్థులము కంగ్టి మండలము ఏర్పడిన నాటి నుండి ఏళ్ళ తరబడి కంగ్టి మండలములో కొనసాగుచున్నాము. కాగా, ఇటీవల తడ్కల్ నూతన మండల కేంద్రముగా ఏర్పడనున్నందున మా నాగన్ పల్లి గ్రామమును నూతన తడ్కల్ మండలములో చేర్చుటకు ప్రతిపాదించుచున్నారు. కాగా, మా యం.పి.టి.సి. గ్రామ మైనా గాజుల్పాడ్ మరియు నాగన్ పల్లి రెండింటిలో కేవలం నాగనపల్లిని మాత్రమే తడ్కల్లో చేర్చుతూ ఆ గ్రామము దాటి ఉన్న నాగన్ పల్లి నీ తడ్కల్లో ఏ కారణం చేత చేర్చుతున్నారో తెలియడం లేదు.
అదే విధంగా ప్రస్థుత కంగ్టి మండల కేంద్రములో బ్యాంకు, మార్కెట్, రవాణా సౌకర్యాలు మొదలగునవి అందుబాటులో ఉన్నవి. మాకు సిర్గాపూర్ &కంగ్టి రెండు కేవలం 11 కి॥మీ॥ల దూరం ఉండగా తాడ్కాల్ 15 కి॥మీ॥ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రత్యేక మార్గం అయినందున రవాణా వ్యవస్థ సరిగ్గా లేనందున గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
కావున గ్రామములో అభిప్రాయ సేకరణ నిమిత్తము క్యాంపు నిర్వహించి గ్రామస్థులందరి అభియాప్రాయాలను పరిగణలోనికి తీసుకొని, మా నాగన్ పల్లి గ్రామమును యథావిధిగా కంగ్టి మండలంలో కొనసాగించాలని లేదా ఇటీవల నూతన మండలముగా ఏర్పాటైన సిర్గాపూర్ నందు చేర్చుటకై తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని తమరితో సవినయముగా నాగన్ పల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు