సత్యమేవ జయతే/హత్నూర:
సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని నాగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మంగళవారం చందానగర్ వాస్తవ్యులు హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొండ విజయ్ కుమార్, 35 మంది విద్యార్థిని విద్యార్థులకు బ్యాగ్స్ పరీక్ష పాడ్స్ పెన్నులు పెన్సిల్లు మరి ఇతర స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం చేయడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ తో పాటు ఆర్థికంగా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. తమ వంతు సహకారంగా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థి విద్యార్థులు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడంతో ఉపాధ్యాయ బృందం హోప్ ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రథమ ఉపాధ్యాయులు సబితా దేవి, ఉపాధ్యాయులు ధర్మారావు, సిఆర్పి స్వామి, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.