సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వంకై పోరాడుదాం
మహిళలపై హింసను వ్యతిరేకిద్దాం
సత్యమేవ జయతే -వికారాబాద్ టౌన్
అంతర్జాతీయ శ్రామిక మహిళల హక్కుల కోసం కమ్యూనిస్టు మహిళ నాయకురాలు క్లారా జట్కిన్ నాయకత్వంలో ఏర్పడిన 1911 మార్చి 8 అంతర్జాతీయ మహిళా పోరాట దినోత్సవం స్ఫూర్తితో ఉద్యమిద్దాం.
2025 మార్చి 8 అంతర్జాతీయ మహిళా పోరాట దినం సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో బాలికల కళాశాల హాస్టల్ లలో ప్రగతిశీల మహిళా సంఘం సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం కై పోరాడుదాం! మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడుదాం!! అనే అంశం పైన నిర్వహించిన సదస్సుల లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి వై గీత అన్నారు.
ప్రపంచ మహిళా ప్రజాస్వామ్య పోరాటాల్లో మమేకమవుదాం
సామ్రాజ్యవాదానికి, యుద్ధ ఉన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నియంత్రించాలి ఐసీసీ కమిటీలను ఏర్పాటు చేయాలి
మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి
గ్రామాలలో బెల్ట్ షాపులను రద్దు చేయాలి సంపూర్ణ మధ్య నిషేధానికి పాటుపడాలి
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో సమానత్వానికై పోరాడుదాం అన్ని పిలుపు ఇచ్చారు