Friday, March 14, 2025
ads
Homeఅనంతపురంశైలజనాథ్ : వైఎస్సార్‌సీపీలో చేరనున్న మాజీ మంత్రి...

శైలజనాథ్ : వైఎస్సార్‌సీపీలో చేరనున్న మాజీ మంత్రి…

సత్యమేవ జయతే – అనంతపురం వైఎస్సార్‌సీపీ మరోసారి మార్పులు చేర్పులకు సిద్దమవుతుంది.అనంతపురం జిల్లా, సింగనమలలో వైసీపీకి కొత్త నాయకుడు కావాలి కాబట్టి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా ఓ మాజీ మంత్రి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. దివంతగత రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించిన కారణంగానే ఆ నేత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
కాంగ్రెస్ నేత , మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ వైఎస్సార్‌సీపీ ఖండువా కప్పుకోనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శైలజానాథ్ పార్టీలో చేరనున్నారు. శింగనమల వైసీపీ ఇంచార్జ్‌గా శైలజానాథ్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో శింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్. గత 30 ఏళ్లుగా అదే సెంటిమెంట్ కొనసాగుతోంది. వైఎస్ హయాంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు శైలజనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా శింగనమల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత టీడీపీ నుంచి శమంతకమణి, ఆమె కుమార్తె యామిని బాల మంత్రులుగా, ఎంఎల్ఏలుగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2019 లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచి 2024 ఎన్నికల్లో టికెట్ కూడా సాధించుకోలేకపోయారు.
ఇప్పుడు సింగనమలలో వైసీపీకి కొత్త నాయకుడు కావాలి కాబట్టి జగన్ కూడా శైలజానాథ్‌ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. దివంతగత రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించిన కారణంగానే శైలజానాథ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలిసారిగా 2004లో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఆయన మొదటి సారి పోటీ చేసి గెలిచారు. 2009లో మళ్లీ గెలుపొందారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. విభజన తర్వాత నుంచి కూడా శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీతోనే అంటకాగుతున్నారు. ఆ క్రమంలో జగన్ ఆహ్వానం మేరకు శైలజానాథ్ వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం.

ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారి పీసీసీ చీఫ్‌గా రఘువీరా రెడ్డి బాధ్యతలు స్వీకరించగా, ఆయన తర్వాత సాకే ఆ స్థానాన్ని చేపట్టారు. అయితే, అప్పట్లో జగన్‌కు వ్యతిరేకంగా ఎక్కువగా మాట్లాడడం లేదని కొందరు పెద్దలు అధిష్టానానికి ఫిర్యాదు చేయడం.. శైలజానాథ్‌కు కూడా రాజకీయంపై పెద్దగా ఆశక్తి ఉండకపోవడంతో ఆయన పార్టీ పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన రాజకీయాల్లోకి యాక్టీవ్ అవుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments