వినాయక హాస్పటల్ మహిళా దినోత్సవాలు
సత్యమేవ జయతే -వికారాబాద్
కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న వైద్యులు …. సత్యమేవ జయతే వికారాబాద్ జిల్లా. తాండూరు పట్టణం శాంతినగర్ కాలనీలో వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. శనివారం మహిళా దినోత్సవ సందర్భంగా హాస్పిటల్ చెందిన డాక్టర్ నవ్య చింత ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. హాస్పిటల్లో మహిళ వైద్యులు సిబ్బంది కేకు కట్ చేశారు హాస్పిటల్ ఎండి డా. చందర్ డాక్టర్ రవీందర్ మైల వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ వైద్యులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు