సత్యమేవ జయతే – ఆళ్లపల్లి ఆళ్లపల్లి, ఫిబ్రవరి 20 : కొమరం వంశీయుల ఆరాధ్య దైవమైన రెక్కల రామక్క జాతర జనసంద్రమైంది. గురువారం సాయంత్రం పాండువుల గుట్ట నుంచి వనదేవతను ఆలయ ప్రాంగణంలోని గద్దెల వద్దకు పూజారులు, కొమరం వంశీయులు తీసుకొచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది. వనదేవతను తీసుకువస్తున్న సమయంలో కొమరం వంశీయులు కమిటీ సభ్యులు గిరిజన సంప్రదాయాలతో ముత్యాలతో ఆడుతూ ఎంతో అంగరంగ వైభవంగా పాండవుల గుట్ట నుండి గుడి ప్రాంగణానికి దేవతను తీసుకువచ్చారు. ఈ జాతరకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ,పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విచ్చేసి వనదేవతలను దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో గిరిజన ముత్యాలు చేశారు. జాతర పురస్కరించుకొని మూడు రోజులపాటు నిర్వహించిన వాలీబాల్ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. మండల కేంద్రంలో అతిపెద్ద జాతర కావడంతో ఇల్లెందు డిఎస్పి చంద్రభాను, అల్లపల్లి ఎస్సై రతీష్ తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కొమరం హనుమంతరావు, మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, పిఎసిఎస్ చైర్మన్ గుగ్గిల రామయ్య, రైతు సమన్వయ కమిటీ సభ్యుడు కొమరం వెంకటేశ్వర్లు, భారతీయ ఆదివాసి సమ్మేళన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కొమరం లక్ష్మణరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాయం నరసింహారావు, ఆలయ కమిటీ సభ్యులు కొమరం సత్యనారాయణ, కొమరం రాంబాబు, టీచర్ కృష్ణంరాజు, రవి, వెంకటేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.