Friday, March 14, 2025
ads
Homeఆంధ్ర ప్రదేశ్అనంతపూర్లెమన్‌ టీ తాగుతున్నారా?.. అయితే ఈ లాభాలు తెలుసుకోండి..అస్సలు...

లెమన్‌ టీ తాగుతున్నారా?.. అయితే ఈ లాభాలు తెలుసుకోండి..అస్సలు వదిలిపెట్టరు..

ప్రతిరోజు పాలతో తయారుచేసిన టీకి బదులుగా లెమన్ టీని తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. నిమ్మ లో ఉండే ఔషధ గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రతిరోజు లెమన్ టీని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ ని ప్రతిరోజు తాగితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ టీ వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
నీరు, నిమ్మ రసం, తేనె, పుదీనాతో చేసే ఈ లెమన్ ‘టీ’ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మెదడును యాక్టివ్‌ చేస్తుంది. ఆందోళన, డిప్రెషన్‌, ఇతర మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి. శరీర వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయం ‘లెమన్‌ టీ’ని ఏదైనా తిన్న తర్వాత తాగాలి. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెటబాలిజం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది.
లెమన్‌ టీని ఉదయం పరగడుపున కూడా సేవించవచ్చు. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. కాలేయానికి కూడా మేలు జరుగుతుంది. లెమన్‌ టీ తాగితే మైగ్రేన్‌ తగ్గుతుంది. అలాగే జలుబు, దగ్గు సమస్యతో బాధపడుతుంటే ఈ టీని తాగడం వల్ల కాస్త ఉపశమనం పొందవచ్చు. అందుకే అవకాశం ఉంటే టీ, కాఫీ తాగేకంటే లెమెన్ టీ తాగడానికి ప్రయత్నించండి.
లెమన్‌ టీ అలవాటుతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో ఐరన్ లోపాన్ని నివారించడానికి పనిచేస్తుంది. ఇది అధిక రక్తపోటు సమస్య నుండి నివారిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం ఇస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
లెమన్ టీలో అల్లం వేసి తయారు చేయటం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా అందుతాయి. అల్లం వికారం సమస్యను అధిగమించడానికి సహాయపడుతుంది. ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది.
లెమన్‌ టీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో క్రీమ్, చక్కెర ఉండదు. అందువల్ల ఇది వేగంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మూత్రపిండాలు, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments