Thursday, August 14, 2025
ads
Homeగాడ్జేట్స్రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలను కట్టడి చేయాలి : విక్రమ్...

రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలను కట్టడి చేయాలి : విక్రమ్ బత్తుల


సత్యమేవ జయతే – హైదరాబాద్
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలను కట్టడి చేయాలని అంబేద్కర్ సేన, తెలంగాణ రాష్ట్ర కో-కన్వీనర్ మరియు సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్, విక్రమ్ బత్తుల గారు డిమాండ్ చేశారు. నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని ఫీజుల పేరుతో జలగల్లా పట్టిపీడిస్తున్నారని ఆరోపించారు. దీనిని నియంత్రించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. భాగంగా తాము సందర్శించిన వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు.
ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలలు గడుస్తున్నా నేటికీ విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడమే దీనికి నిదర్శనం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంల పేరుతో అందిన కాడికి దండుకుంటున్నాయని వాపోయారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పేరుకుపోవడంతో యాజమాన్యాలు కళాశాలలను నడపలేని స్థితికి దిగజారాయని గుర్తు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థలు నడుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యాశాఖకు మంత్రిని నియమించడంతోపాటు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ఫీజుల దోపిడీని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మిగిలిన విద్యార్థి సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments