సత్యమేవ జయతే – హైదరాబాద్
హైదరాబాద్ : ప్రముఖ టీవీ న్యూస్ యాంకర్, జర్నలిస్టు స్వేచ్ఛ ఆత్మహత్య అందరు ఉలిక్కిపడేలా చేసింది. ఎంతో చలాకీగా ఉండే స్వేచ్ఛ ఇలా ఆకస్మిక మరణం చెందుతుందని ఎవరు ఊహించలేదు. స్వేచ్ఛ ఆత్మహత్య అనంతరం పూర్ణ చంద్ర నాయక్ అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. స్వేచ్ఛకి గతంలోనే వివాహం కాగా, ఆమె తన భర్త నుండి విడిపోయి పూర్ణ చంద్రతో ఉంటున్నట్లు సమాచారం. అయితే స్వేచ్ఛ, పూర్ణ చంద్రనాయక్ మధ్య కొన్నాళ్లుగా విబేధాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయనతో కలిసి ఉండలేనని స్వేచ్ఛ ఇటీవలే తన తల్లిదండ్రులకు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు మాట ఇచ్చిన పూర్ణ చంద్ర కాలయాపన చేస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి , ఈ విషయంలోనే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు చావుకు పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమంటూ కామెంట్ చేశారు. మూడు సంవత్సరాల నుంచి తన కూతురు వెంట పూర్ణచందర్ పడ్డాడని.. అతడి వేధింపుల వల్లనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పుకొచ్చాడు.
నా కూతురు పెళ్లికి అంగీకరించిన కూడా ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవ జరిగింది. ఇటీవల గొడవలు పీక్స్‌కి చేరడంతో పూర్ణచందర్‌తో కలిసి ఉండను అని స్వేచ్ఛ తేల్చి చెప్పింది. జూన్ 26న ఇద్దరికీ గొడవ జరిగితే నన్ను ఇంటికి రమ్మని పిలిచింది. అప్పుడు నేను వెళ్లగా .. పూర్ణచందర్‌తో నేను రిలేషన్ లో ఉండలేను అని చెప్పుకొచ్చింది . పూర్ణచందర్ వేధింపుల వల్ల నా కూతురు తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది అంటూ తండ్రి శంకర్ తీవ్ర ఆవేదన చెందారు. ఇక గాంధీ ఆసుపత్రిలో స్వేచ్ఛ పోస్ట్ మార్టం పూర్తి కాగా, స్వేచ్ఛ కుటుంబ సభ్యులు.. ఆమె కళ్లను దానం చేశారు.