Friday, March 14, 2025
ads
Homeజిల్లాలుమీరు ఫ్లెక్సీని చించొచ్చు.. కానీ కేసీఆర్‌ను ప్రజల గుండెల్లో...

మీరు ఫ్లెక్సీని చించొచ్చు.. కానీ కేసీఆర్‌ను ప్రజల గుండెల్లో నుంచి వేరు చేయలేరు.. కాంగ్రెస్‌ నాయకులకు సబితా ఇంద్రారెడ్డి వార్నింగ్‌

సత్యమేవ జయతే – హైదరాబాద్
హైదరాబాద్ : కేసీఆర్‌కు భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని సబితా ఇంద్రారెడ్డి ప్రార్థించారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ కేసీఆర్‌ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేసీఆర్‌ బొమ్మ కనిపిస్తేనే భయం వేస్తోందని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌ ఫ్లెక్సీలు, బ్యానర్లను మీరు చించేయొచ్చు కానీ.. ప్రజల గుండెల్లో నుంచి మాత్రం కేసీఆర్‌ను తొలగించలేరని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లే గ్రౌండ్‌లో, చందన చెరువు కట్టపై ఆమె మొక్కలు నాటారు. అనంతరం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌కు భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని ప్రార్థించారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ కేసీఆర్‌ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేసీఆర్‌ బొమ్మ కనిపిస్తేనే భయం వేస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గత పదేండ్లలో ఏ నాయకుల ఫ్లెక్సీలను తాము చింపేయలేదని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమ నేతను రాష్ట్రంలో జీవించే హక్కు లేదని విమర్శించారని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చిల్లర మల్లర రాజకీయాలకు పాల్పడుతుందని ఆమె మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలన ప్రజలకు అందించిన ఘనత ఆయనదే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలను ఒకతాటిపై తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేశ్‌ రెడ్డి, సిద్దాల లావణ్య, దిండు భూపేశ్‌ గౌడ్, దీప్‌లాల్ చౌహాన్, అర్కల భూపాల్ రెడ్డి, శీను నాయక్, విజయలక్ష్మి, రామిడి రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments