– భారత మూల వాసుల ఫోరం (ఎన్ఎఫ్ఐ) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్ గారు బాధ్యతలు అప్పగించారు
కొండాపూర్ : భారత ములవాసుల ఫోరం(ఎన్ఎఫ్ఐ) కొండాపూర్ మండల అధ్యక్షునిగా కౌకుంట్ల బీరయ్యను నియమిస్తూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్ గారు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశంలోని ములవాసుల అభివృద్ధి, వారి సంస్కృతిని కాపాడుకోవడం కోసం కృషి చేస్తుందని అన్నారు. యువతలో చైతన్యం కోసం కృషి చేయాలని అన్నారు.
– బీరయ్య గారు మాట్లాడుతూ
భారత ములవాసుల ఫోరం (ఎన్ఎఫ్ఐ) కమిటిలను ప్రతి గ్రామంలో, మరియు కొండాపూర్ మండలంలో త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. అలాగే మరెన్నో వారి సంస్కృతిని కాపాడుకోవడం కోసం కృషి వంతు కృషిని చేస్తా అన్నారు. తనను నియమించిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్ గారికి కృతఙ్ఞతలు తెలిపారు.