సత్యమేవ జయతే – సంగారెడ్డి
సంగారెడ్డి : భారత ములవాసుల ఫోరం (ఎన్ఐఎఫ్) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కొండాపూర్ మండలం గంగారం గ్రామానికి చెందినా విక్రమ్ ను నియమిస్తూ జాతీయ అధ్యక్షులు గౌ.బీరయ్య యాదవ్ గారు ఉత్తర్వులు జారి చేశారు. ఈ మేరకు బుధవారం రోజు నియామక పత్రాన్ని అందజేశారు.
– విక్రమ్ గారు మాట్లాడుతూ….
భారత ములవాసుల ఫోరం (ఎన్ఐఎఫ్) సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నాకు అప్పగించిన జాతీయ అధ్యక్షులు గౌ.బీరయ్య యాదవ్ గారికి అలాగే రాష్ట్ర నాయకులకి ధన్యవాదాలు.
సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండల మరియు నియోజక వర్గాల కమిటిలను నియమించుటకు నాకు అధికారం ఇవ్వనైనది. నా వంతు బాధ్యత జిల్లా నాయకులతో కలిసి నెరవేర్చుతానని హామీ ఇస్తున్నాను మీ విక్రమ్ బత్తుల గారు అన్నారు.