సత్యమేవ జయతే – హైదరాబాద్ క్యాన్సర్ పై అవగాహన పెంపొందించడానికి, నివారణ, గుర్తింపును, ప్రారంభ దశలో చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతియేటా ఫిబ్రవరి 4 వ తేది నీ పురస్కరించకుని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు
రాష్ట్ర వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ. రాష్ట్రం లో క్యాన్సర్ వ్యాధి నియంత్రణపై పూర్తిస్థాయి దృష్టి సారించామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రం లో క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ సెంటర్ లు ఏర్పాటు, ఉచితంగా ఆధునిక చికిత్సాను, పాలియెటివ్ డెర్ సెంటర్ లను ఏర్పాటు చేశామన్నారు. వరల్డ్ క్యాన్సర్ డిక్లరేషన్ లక్ష్యాలకు మద్దతుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కృషి చేస్తున్నామన్నారు. క్యాన్సర్ వల్ల అనారోగ్యం, మరణాలను గణనీయంగా తగ్గించటమే తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.