Friday, March 14, 2025
ads
Homeతెలంగాణ*ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మటన్ వ్యాపారస్తుడు* ఆందోల్...

*ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మటన్ వ్యాపారస్తుడు* ఆందోల్ మండలం నేరడిగుంట ఎక్స్ రోడ్డులో ఒక మటన్ వ్యాపారి ప్రజల కండ్లు కప్పి మేక మాంసం అని చెప్పి గొర్రె మాంసం అమ్ముతున్నాడు అందులో రోగాలు ఉన్న గొర్రెలు,సచ్చిపోయిన గొర్రెల మాంసం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. విషయం తెలుసుకున్న నేరడిగుంట యువజన నాయకుడు అందరి హృదయాల్లో సోషల్ వర్కర్ గా పేరు సంపాదించుకున్న మిద్దెల శ్రీదర్ రెడ్డి ఈరోజు ఉదయం తనిఖీ చేసి మటన్ వ్యాపారి బండారం బయటపెట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడాడు.గ్రామానికి మణిహారంగా ఉన్న మన నేరడిగుంట గ్రామంలోని ఎక్స్ రోడ్డులో ఇలాంటి సంఘటలు జరుగకుండా మంచి పేరు తేవడానికి కృషి చేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.దయచేసి నిద్ర మత్తులో ఉన్న అధికారులు కాసులకు ఆశపడకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని ప్రజలు హెచ్చరించారు.ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమంలు చేస్తూ ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రత్యక్షం అయ్యి మంచి పనులు చేస్తున్న సోషల్ వర్కర్ శ్రీదర్ రెడ్డిని గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments