Friday, March 14, 2025
ads
HomeUncategorizedపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జహీరాబాద్...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ మరియు ఖేడ్ ఎమ్మెల్యే

సత్యమేవజయతే_నారాయణఖేడ్

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్ మరియు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
ఈ సందర్భంగా ఎంపి,ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ -నిజామాబాద్ — కరీంనగర్ ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టపద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డా.వుట్కూరి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టి నీ ఇచ్చి గెలిపించాలని వారు కోరారు
నరేందర్ రెడ్డి విద్యావేత్తగా ఒక గణిత ఉపాధ్యాయునిగా సామాజికవేత్తగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు, పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలిసిన నాయకుడు మన నరేందర్ రెడ్డి
ఎంతోమంది పేద విద్యార్థులకు తన విద్యాసంస్థలు ఉత్తమ విద్యను మరియు ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారని వారు తెలిపారు,
శాసనమండలిలో పట్టభద్రుల తరఫున గళం వినిపించడమే గాక వారి సమస్యల పరిష్కారం కోసం నరేందర్ రెడ్డి కృషి చేస్తారని వారు అన్నారు,
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు, ముందు ముందు రోజుల్లో కూడా మరిన్ని ఉద్యోగాల భర్తీ చేస్తామని ఎమ్మెల్యే అన్నారు,బిజెపి పార్టీకి మన తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంత చిన్నచూపు గత నెలలో నిర్వహించిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో మన తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చిందో ఎంత బడ్జెట్ ని మన తెలంగాణకు ఇచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు కావున బిజెపి పార్టీకి ఈ పట్టబద్రుల ఎన్నికల్లో బుద్ధి చెప్పి మన పట్టభద్రుల సమస్యలపై శాసనమండలిలో సమస్యల పరిష్కారానికై కృషి చేసే నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం అన్నారు విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీ మరియు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు కావున ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్క పట్టభద్రుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు….ఈ కార్యక్రమంలో వారితో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డి గారి సోదరుడు వుట్కూరి ఫణిందర్ రెడ్డి,డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి , రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ శేట్కర్,తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ శేట్కర్ మరియు పట్టభద్రులు, నారాయణఖేడ్ నియోజకవర్గ వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments