మీసేవలో నూతన రేషన్ కార్డు,యూడీఐడీ వచ్చిన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఈడీఎం ఉదయ్ కుమార్ అన్నారు.మంగళవారం ఈడీఎం మేనేజర్ ప్రదీప్ తో కలసి నారాయణఖేడ్ పట్టణంలోని మీసేవ కేంద్రాలను ఆకస్మింగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మీసేవ నిర్వాహకులు వినియోగదారులకు మెరుగైన సేవలను అందించాలని,నిర్ణీత ధర తీసుకోవాలన్నారు.వేసవి కాలం రానందున వినియోగదారుల కోసం మంచినీటి సౌకర్యం కేంద్రంలో ఏర్పాటు చేయాలన్నారు. నూతనంగా వచ్చిన రేషన్ కార్డు, యూడీఐడీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.