వాస్తవ నేస్తం,బోనకల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన
ఆంధ్రప్రభ రిపోర్టర్ యార్లగడ్డ శ్రీనివాసరావు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన వారు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని అన్నారు. సిపిఎం జిల్లా నాయకులు దొండపాటి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కిలారు సురేష్, తెల్లాకుల శ్రీనివాసరావు యేసుపోగు బాబు, టిఆర్ఎస్ నాయకులు మాజీ జెడ్పిటిసి బానోతు, కొండ తదితరులు ఉన్నారు.
