Saturday, March 15, 2025
ads
Homeగాడ్జేట్స్నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే...

నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే జాబ్..!

సత్యమేవ జయతే – ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం నిరుద్యోగ గిరిజన యువతకు ఐటీడీఏ శుభవార్త తీసుకువచ్చింది. యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగాలు కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ జాబ్ మేళాను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 12న భద్రాచలంలో జరిగే జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి రాహుల్ కోరారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నిరుద్యోగ గిరిజన యువతకు ఐటీడీఏ శుభవార్త తీసుకువచ్చింది. నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో అవకాశాలు కల్పించడానికి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ జాబ్ మేళాను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 12న భద్రాచలంలో జరిగే జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ జాబ్ మేళాలో మెడ్ ప్లస్, నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు, ఐటీసీ ప్రథమ్ సంస్థలు పాల్గొంటున్నాయి. నిరుద్యోగ గిరిజన యువతకు రెండు నెలల ఉచిత భోజనం, వసతిని అందించి శిక్షణతపాటు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. ఎస్ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, డిప్లొమా, బి.టెక్, పీజీ విద్యా అర్హతలు కలిగిన యువత ఈ జాబ్ మేళాకు హాజరు కావాలని రాహుల్ కోరారు. ఫిబ్రవరి 12న జరిగే ఈ మేళాలో ఆసక్తిగల నిరుద్యోగ గిరిజన యువత ఉదయం 9 గంటలకు ఐటీడీఏ భద్రాచలం ప్రాంగణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌కు రావాలని సూచించారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే జరిగే ఇంటర్వ్యూకు విద్యా అర్హత పత్రాలు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరుకావచ్చని బి.రాహుల్ అభ్యర్థించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments