Friday, March 14, 2025
ads
Homeజిల్లాలుతెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు ఘనంగా...

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాబీఆర్ఎస్ నాయకులు

సత్యమేవ జయతే – పెద్దపల్లి పెద్దపల్లి : సోమవారం నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పెద్దపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ బొల్లం భూమేష్ గారి ఆధ్వర్యంలో 101 మొక్కలు నాటి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన
– పెద్దపల్లి నియోజకవర్గంబీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష గారు
ఈ సందర్భంగా ఉష గారు మాట్లాడుతూ తెలంగాణను ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు ఒక్క నాడు కేసీఆర్ గారే నేడు కేసీఆర్ గారే రాబోయే తరానికి కూడా కేసీఆర్ గారే ఎందుకంటే తెలంగాణ లో టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి పార్లమెంటులో సైతం కొట్లాడి మాకు తెలంగాణను తీసుకు రావడం జరిగింది
నేడు కాంగ్రెస్ పీడిత పాలనలో రైతన్నలను దుర్మార్గంగా వారి చేతికి గొలుసులు వేసి జైల్లో పెడుతున్నటువంటి రాజ్యం మన కాంగ్రెస్ పాలనలలో చూసినం అట్లాంటి రాజ్యంలోనుండి మల్ల మనల్ని బ్రతికించేది ఎవరు అంటే మల్ల మన కేసీఆర్ గారే
రానున్నతరానికి ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా చేద్దామ అని హృదయం నిండా తెలంగాణను పెట్టుకున్నటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ సార్
అలాంటి కెసిఆర్ గారి వల్లనే ఈ తెలంగాణ బంగారు మయం అవుతుంది కాబట్టి నేడు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా 101 మొక్కలు నాటుతున్నాము ఈ మొక్క విత్తనం నుండి మొక్క చెట్టయిన తర్వాత భూమిలో నుండి పాతుకపోయి ఉంటుంది
కేసిఆర్ గారి ఆనవాళ్లు చెరిపేస్తం చెరిపేస్తామంటూ విర్రవీగుతున్న కాంగ్రెస్ నాయకులకు ఈ విధంగా చెప్పేదేంటంటే ఆయన ఆనవాళ్లు కాదు కదా మేము పెట్టిన మొక్కను కూడా పీకలేరంటు చెప్పడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఓదెల మండలం జెడ్పిటీసి గంట రాములు యాదవ్, మాజీ మర్కెట్ డైరెక్టర్ సలేవేన రాములు, మాజీ ఎంపీటీసీ కాల్వల రవి, చిన్న కాల్వల ఎంపిటిసి గుర్రం సంపత్ , మాజీ వార్డ్ మేంబర్ కాల్వల గోపాల్, మాజీ వార్డ్ మెంబర్, కాల్వల శ్రీనివాస్, కాల్వల రవి , భూమేష్, దొడ్డి అశోక్, భీరం రవి, చిట్ట వెని వినిత్,పల్లె రాకేష్ రవి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments